నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6.
420 మంది విద్యార్థులు గైర్హాజరు.
జిల్లాలో తొలి మాల్ ప్రాక్టీస్ కేసు.
ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాష సబ్జెక్ట్లతో పరీక్ష లు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. 420 విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. ఒక విద్యార్థి చీటీ లు రాయగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని అన్నారు. దీంతో జిల్లాలో తొలి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైందని తెలిపారు. మొత్తం జిల్లాలో 15,923 మంది విద్యార్థులకు గాను16,343 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలియజేశారు. మొత్తం 97.4 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 49 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. నిజామాబాద్ ఖిల్లా బాలుర జూనియర్ కళాశాల – బీ సెంటర్ లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసింది. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లు తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా బాలుర జూనియర్ కళాశాల ఏ సెంటర్, బి సెంటర్ నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కంటేశ్వర్ లోని ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలను, రవి కాకతీయ జూనియర్ కళాశాల ఏ సెంటర్, బీ సెంటర్, మహిళా కాకతీయ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు.