ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాలతో పోలీస్ శాఖ, మోటార్ వాహనాల శాఖ ఆధ్వర్యంలో స్కూల్, ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్స్యూరెన్స్ వివరాలను పరిశీలించారు.విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. నియమాలను ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి, డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
జిల్లాలో స్కూల్,ప్రైవేట్ బస్సుల తనిఖీలు
Published On: October 30, 2025 10:20 pm









