నిజామాబాద్ వైద్య కళాశాలలో పెరిగిన సీట్లు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నిజామాబాద్ మెడికల్ కళాశాలో పీజీ సీట్లు పెరిగాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.నిజామాబాద్ వైద్య కళాశాలలో పీజీ సీట్లు పెరిగాయని కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.పీడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు పెంచారని.. పాత మూడు సీట్లతో కలిపి ఇప్పుడు మొత్తం ఏడు పీజీ సీట్లు అయ్యాయన్నారు. డెర్మటాలజీ విభాగంలో నాలుగు పీజీ సీట్లు కొత్తగా అందుబాటు లోకి వచ్చాయని పేర్కొన్నారు. పీజీ సీట్లు పెరగడంతో మరింత సేవలు మెరుగవుతాయని వారు హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రిన్సిపాళ్లు డా. జలగం తిరుపతి రావు, డా. నాగమోహన్, డా. కిషోర్, హెచ్వోడీలు, ఫ్యాకల్టీ, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment