నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మస్జిద్ ఏ కచియాన్ వెనుక ప్రాంతంలో గల పాత యిదా్ లో కొత్తగా నిర్మించిన మెహ్రాబ్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మోహమ్మద్ అలీ షబ్బీర్ మంగళవారం ప్రారంభించారు.ఈ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు మంజూరు చేసింది. మున్సిపల్ కమిషన్ మరియు ఆర్‌డిఓ పర్యవేక్షణలో పనులు పూర్తయ్యాయని కమిటీ సభ్యులు తెలిపారు.కార్యక్రమంలో ఈద్‌గాహ్ జదీద్ మరియు ఖదీమ్ కమిటీ సదర్ అబ్దుల్ రహమాన్ బజారా, జనరల్ సెక్రటరీ అహ్మద్ అబ్దుల్ హలీం, సభ్యులు రఫీక్, వసీం, మంజూర్ మోహి ఉద్దీన్ ప్రజాప్రతినిధులు రత్నాకర్, ఖద్దూస్, ముజాహిద్ ఖాన్, పాపాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్‌గాహ్ ఖదీమ్‌లో కొత్త మెహ్రాబ్ ప్రారంభం
Published On: December 31, 2025 11:38 am











