నిజామాబాద్‌లో ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ అవగాహన సెమినార్ విజయవంతం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 16 : (షేక్ గౌస్) రిఫా చాంబర్ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం అహ్మదీబజార్‌లోని అబూ లైస్ హాల్‌లో చైనా‌తో వాణిజ్యం (Import–Export) పై ఒక ముఖ్యమైన అవగాహన సెమినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి స్థానిక వ్యాపారులు మరియు యువత పెద్ద ఎత్తున హాజరై ఆసక్తి చూపించారు.రిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ అలీ ఖాన్ సెమినార్‌లో మాట్లాడుతూ, యువత వ్యాపార రంగంలో ముందుకు రావాలని, నిజాయితీ, నైతిక విలువలు మరియు పారదర్శకతతో వ్యాపారం చేస్తూ ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపాలని పిలుపునిచ్చారు.చైనా వ్యాపార నిపుణుడు సోయేబ్ బషీర్ చైనా వ్యాపార నియమాలు, దిగుమతి–ఎగుమతి విధానాలు, అవసరమైన పత్రాలు, మరియు చైనా మార్కెట్‌లో ఉన్న వ్యాపార అవకాశాలపై వివరమైన ప్రదర్శన ఇచ్చారు. అంతర్జాతీయ వాణిజ్యంలో జాగ్రత్తలు, ఖర్చులను తగ్గించే చిట్కాలు మరియు ప్రాక్టికల్ మార్గదర్శకతను కూడా అందించారు.కార్యక్రమానికి అబ్దుల్ రహమాన్ బజారా అధ్యక్షత వహించగా, హలీమ్ ఖమర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. జమాత్-ఎ-ఇస్లామీ అహ్మదీబజార్ అమీర్-ఏ-మూఖామి సహా రిఫా సభ్యులు రషీద్ ఆరీఫ్, తౌఫిక్, షహీద్ అహ్మద్, ముసవ్విర్, షేక్ గౌస్ తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment