నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఈరోజు ఆర్మూర్ meo ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఈఓ రాజ గంగారాంకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేశు సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య లు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల యందు మధ్యాహ్న భోజన కార్మికురాలు సుజాతను బియ్యం లో పురుగులు ఉన్నాయని నేపంతో తొలగించడం జరిగింది. బలమైన కారణం లేకుండా తొలగించిన కార్మికురాలను విధుల్లోకి తీసుకోవాలని జిల్లావ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అక్రమ తొలగింపు ఆపాలని హెచ్ఎం వనజ రెడ్డి ని డిస్మిస్ చేయాలని సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు వంట బంద్ చేసి ధర్నా నిర్వహిస్తామని తెలియజేయడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం కార్మికులను తక్షణమే వీధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. 15న రౌండ్ టేబుల్ ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించి 18న చలో ఆర్మూర్ నిర్వహిస్తామని అన్నారు. ఇట్టి కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఒకపక్క బిల్లులూ రాక నిత్యవసర సరుకులు ఆకాశాన్నంటుతున్న సందర్భంగా మొలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది. కావున సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నాలు చేయాలి. కానీ ఒంటెద్దు పోకడ పనికిరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు భూమన్న, రఫిక్, సాజిద్ ఖాన్, ఖలీల్, గర్ల్స్ హైస్కూల్ మధ్యాహ్న భోజన కార్మికులు సుజాత ,సత్యమ్మ, దెవై లు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులను అక్రమ తొలగింపులు ఆపాలి
Published On: November 13, 2024 8:23 pm
