నేరాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం – కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

జై భారత్ దినపత్రిక కామారెడ్డి ప్రతినిధి జనవరి 03 : యువత మంచి మార్గంలో నడవాలని, నేరాలకు పాల్పడితే వారిపై షీట్ ఓపెన్ చేస్తామని కామారెడ్డి జిల్లాఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పాత నేరస్తులు, అనుమానితుల గురించి శనివారం ఆరా తీశారు.దేవునిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామేశ్వర్‌పల్లి, శాబ్దిపూర్ తండాలో గతంలో చోరీలకు పాల్పడిన సస్పెక్ట్ షీటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని పాపిలాన్ డివైస్ ద్వారా వారిని అక్కడే చెక్ చేశారు. గతంలో వారు చేసిన చోరీల వివరాలు, ప్రస్తుతం వారు ఏ పని చేస్తున్నారో, ఎలా జీవనం సాగిస్తున్నారని అనుమానితుల తల్లిదండ్రులతో మాట్లాడి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లలపై షీట్లు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందో వివరించారు.ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు ఇకపై సత్ప్రవర్తనతో ఎలాంటి నేరాలు చేయకుండా ఉంటే షీట్ తొలగించే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు నివారించవచ్చునని తెలిపారు మొబైల్ ఫోన్లో తెలియని ఏపీకే యాప్లు ఓపెన్ చేయకూడదని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు గ్రామాల్లో గతంలో జరిగిన నేరాల గురించి వివరాలు తెలుసుకున్నారు జిల్లావ్యాప్తంగా 792 మంది పై సీట్లు ఓపెన్ చేయబడి ఉన్నాయని తెలిపారు ఈ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగిస్తూ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇందులో భాగంగానే శనివారం ఎస్సై సీఐలు, డి.ఎస్.పి ,అడిషనల్ ఎస్వీ సాయి అధికారులు స్వయంగా ఫీల్ లెవెల్ చెకింగ్ ద్వారా పాత నేరస్తులను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయని ఆదివారం కూడా తనిఖీలు చేస్తామన్నారు యువత బాగా చదువుకొని క్రమశిక్షణతో జీవిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు అలాగే పిల్లలు ఏం చేస్తున్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment