నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:29 ( షేక్ గౌస్)
నందిపేట మండలానికి చెందిన లంక రజనిష్‌కు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ కల్చర్ యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో ఫోటో టెక్నాలజీ వోల్టాయిక్ రీసెర్చ్ డయోడ్ అంశంపై చేసిన విశేష పరిశోధనలకు గాను ఈ గౌరవాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా లంక రజనిష్ మాట్లాడుతూ, “నా జీవిత స్వప్నం నేడు సాకారమైంది. ఈ గౌరవాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.రజనిష్ గౌరవ డాక్టరేట్ పొందిన వార్త తెలిసి నందిపేట గ్రామస్తులు అతనికి హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.