నగరంలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు;మహేష్ గౌడ్,షబ్బీర్ అలీ.

నిజామాబాద్ జై భారత్ జూన్ 22: నిజామాబాద్ జర్నలిస్టులకు నగరంలో నివాస యోగ్యం కలిగిన స్థలాలు నూటికి నూరు శాతం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తో విపులంగా చర్చించామని వారు చెప్పారు.ఎట్టి పరిస్థితుల్లోనూ నెలలో ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని మహేష్ కుమార్ గౌడ్ ,షబ్బీర్ అలీ వెల్లడించారు. హైదరాబాద్ కు వచ్చి జర్నలిస్ట్ బృందం కలిసిన తర్వాత ఇండ్ల స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు..  ఆదివారం నాడు ఛలో హైదరాబాద్ టీమ్ ఆద్వర్యంలో యూనియన్లకు అతీతంగా జర్నలిస్టు నాయకులు నిజామాబాద్ లో మహేష్ గౌడ్,షబ్బీర్ అలీ ని గౌరవ పూర్వకంగా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, కాంగ్రెస్ కార్యకర్తలు,జర్నలిస్టు నాయకులు i న్యూస్ పంచారెడ్డి శ్రీకాంత్, Big టీవీ కత్తుల రాజేష్,సుభాష్ వాగ్మరే,విజయ క్రాంతి ప్రమోద్ గౌడ్,పాకాల నర్సింలు,99టీవీ మండే మోహన్,v6 రజనీకాంత్,మేఘ 9 విఘ్నేష్,N టీవీ బాల కుమార్,టీవీ9దివాకర్,pti ఆనంద్ పాల్,Brk ధనుంజయ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ శాస్త్రి,జమాల్పూర్ గణేష్,క్రైం మధు,కబురు శివ కుమార్,దిశ ఆడెపు శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ కోశాధికారి సందీప్,ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, గోవింద్ రాజ్, మహమ్మద్ గౌస్, కొట్టుర్ శ్రీనివాస్,మల్లెపూలనర్సయ్య,సంగీత,అనిత,రవిబాబు,కట్ట సతీష్,యాసిన్,ఉస్మాన్,రవుఫ్,ఫరూక్,సాజిద్,సదానంద్,నూక రవి,అజ్మత్,జైపాల్,డాక్టర్ శ్రీనివాస్,శ్రీధర్,సురేందర్ గౌడ్ తో పాటు వీడియో,ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!