సావిత్రిబాయి పూలేకు ఘన నివాళ్లు

జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 03 :(నవీన్ కుమార్) నిజామాబాద్ నగరంలోనీ వినాయక్ నగర్ లో మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా వారి విగ్రహంకు పూలమాలలు వేసి నివాళ్లర్పిం చారు. ఈ సందర్భంగా వారు మన బడుగు బలహీన వర్గాలైన స్త్రీలకు విద్య నేర్పించడం కోసం కష్టపడిన, ఒడి దొడుకులను తట్టుకొని నిలబడిన తీరును గుర్తు చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామా బాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, గంగస్థాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బెల్లీడిగే సత్యనారాయణ, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ దారం భూమన్న, పెద్ద ఎత్తున బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment