ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.

బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి.

నిజామాబాద్  జై భారత్ సెప్టెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలకు బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను అలాగే స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని అభిలాష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి బి.ఆర్.ఎస్ యువజన విభాగం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు మరియు కళాశాల యజమాన్యాలకు తీవ్రమైన ఇబ్బందుల గురి కావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల కాలేజీలు మూతపడి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది.కావున ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని బి ఆర్ ఎస్ యువజన విభాగం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవి, రాజ్ కుమార్, యుగేందర్, కైలాష్, సాయికుమార్, ఆకాష్, దీపక్, సంతోష్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment