అంబులెన్స్ రాకపోకలకు  దారి విడిచి గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి

మండపానికి ప్రక్క నుండి అంబులెన్స్లు మరియు సామాన్య ప్రజానీకం వెళ్లడానికి దారి విడువవలెను.

నేడు ఖలీల్ వాడి లోని రవితేజ గణేష్ మండపనికి ఇరువైపులా దారి ఏర్పాటు..

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 23 : అత్యవసర సమయాలలో అంబులెన్స్లు వెళ్లడానికి ఎక్కడ ఇబ్బందులు కలిగించకుండా , సామాన్య ప్రజలకు మరియు నడకదారిన వెళ్లే ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా గణేష్ మండపాలు రోడ్లపై ఏర్పాటు చేసేవారు మండపానికి ఎడమవైపు మరియు కుడి వైపున రహదారి వదిలి తమ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకోగలరని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య ఐపీఎస్  ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇందులో భాగముగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సంబంధిత అధికారులు తమ పరిధిలో గల గణేష్ మండపాల యాజమానులకు మరియు సంబంధిత ఆర్గనైజర్లకు తెలియజేయడం జరిగింది.ఇందులో భాగముగా నేడు నిజామాబాద్ నగరంలో గల ఖలీల్ వాడిలో గల రవితేజ గణేష్ మండపం వద్ద  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్.  ఆదేశానుసారముగా రోడ్డు మధ్యలో గణేష్ మండపం ఏర్పాటు చేసిన ఇరువైపుల వాహనాదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ACP మస్తాన్ అలీ అద్వర్యంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సిబ్బంది మండపం ఇరువైపులా గల హాస్పిటల్ బోర్డ్స్, మెట్లు మరియు పోల్స్ తొలగించి వాహనములు రావడానికి, వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసినారు.కావున ప్రజలు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసే ముందు దారిలో ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు పాటించాలి దారిలో ఏర్పాటు చేసినట్లయితే రోడ్డుకు ఇరువైపులా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అసౌకర్యం కల్పించకుండా మరియు అంబులెన్స్ వెళ్లడానికి దారి విడిచి ఏర్పాటు చేసుకోగలరు. ఎల్లప్పుడు ప్రజలందరూ సంబంధిత పోలీసు వారికి సహకరించగలరని మనవి.

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!