సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం డి.షరీఫ్
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 19 : నగరంలో నిషేదిత గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ రూరల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం సాయంత్రం ఖానాపూర్ చౌరస్తాలోని ఏకే టీ అండ్ కాఫీ పాయింట్ దగ్గర కొంతమంది వ్యక్తులు నిషేధిత గంజాయి కలిగి ఉన్నారని సమాచారం వచ్చిందని, దాంతో వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా నలుగురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో కనిపించారన్నారు. వారిని చెక్ చేయగా వారి దగ్గర నిషేధిత గంజాయి కనిపించడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వారిని విచారించగా వారి పేర్లు నేనావత్ మోహన్, అక్షిత్, సిద్దార్థ్, ప్రశాంత్ గా తెలిపారు. వారు నిషేధిత గంజాయిని తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముకొని లాభాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకొని వారి పైన కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఇన్స్ పెక్టర్ తెలిపారు. ఈ గంజాయిని వీరు మహారాష్ట్ర, ఒరిస్సా తదితర ప్రాంతాల నుండి కొనుక్కొని వచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడం జరుగుతుందని, ఎవరైనా నిషేదిత గంజాయి కలిగి ఉన్న, సేవించిన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయని నిజామాబాద్ రూరల్ పోలీసులు హెచ్చరించారు.ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడితే సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయనీ అన్నారు.










