కాంగ్రెస్ మాట తప్పింది: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 7.(షేక్ గౌస్)

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జిల్లా కేంద్ర కార్యాలయం లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ తీరుని అర్థమయ్యేలా చేస్తుందని విమర్శించారు.రైతుల రుణమాఫీ, పెన్షన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అమలు కాలేదని ఆరోపించారు. గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.బీసీలకు న్యాయం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో చివరి కాంగ్రెస్ సీఎం అవుతారని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు .

Join WhatsApp

Join Now

Leave a Comment