జవహర్ నవోదయ విద్యాలయాన్ని అడ్డుకుంటున్న మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మ దాహనం. 

తెలంగాణా రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు విద్యా పరంగా ప్రయోజనం కలిగేలా జవహర్ నవోదయ విద్యాలయాన్ని జక్రాన్‌పల్లి మండలం కలీగోట్ వద్ద భూకేటాయింపు జరగాలని జిల్లా కలెక్టర్ ని ఆయన కోరారు.
అయితే, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ షుగర్ ఫ్యాక్టరీకు చెందిన కేవలం 8 ఎకరాల భూమిలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్మాణం జరపాలని ప్రతిపాదనలు పంపించారు.నవోదయ విద్యాలయ స్థాపనకు కనీసం 30 ఎకరాల భూమి అవసరం ఉండగా, కేవలం 8 ఎకరాలు మాత్రమే ఇచ్చి, విద్యాలయ ఆమోదానికి అడ్డుతగిలే సుదర్శన్ రెడ్డి వ్యవహరించడం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి ఈ జిల్లాలో శకుని పాత్ర పోషిస్తూ, శనిలా మారి అభివృద్ధికి నిరంతరం అడ్డుపడుతున్నారు.నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి , మీ నియోజకవర్గానికి మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాన్ని బోధన్‌కు తరలించేందుకు సుదర్శన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, మీరు ఎందుకు స్పందించలేదు? మీ నియోజకవర్గ అభివృద్ధి మీకు అవసరం లేదా? ప్రజలు విశ్వసించి ఓటు వేసి గెలిపిస్తే, మీ నిర్లక్ష్య వైఖరి ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తోంది.జిల్లా అభివృద్ధికి అడ్డు పడుతున్నటువంటి సుదర్శన్ రెడ్డి మరియు భూపతి రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు, విద్యా సంస్థలు మంజూరు చేస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అసత్య ప్రచారాలు చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిని సంకుచిత ఆలోచనలతో అడ్డుకుంటోంది. ఈ కార్యక్రమంలో న్యాలం రాజు, పొతన్ కార్ లక్ష్మీనారాయణ, బద్దం కిషన్, పద్మరెడ్డి, నాగారజు, గడ్డం రాజు. ఇప్పాకాయల కిషోర్. ఆనంద్ రావు. తారక్ వేణు. మేట్టు విజయ్. సందీప్. ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!