ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టికాహారం గురించి ప్రతి ఇంట్లో అవగాహన కల్పించడమే పోషణ మాసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఒక కుటుంబం ఆరోగ్యంగా ముందుకు సాగాలంటే మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలు, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో పోషకాహారం ప్రాముఖ్యత చాలా ఉందని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజ్, సిడిపిఓ సౌభాగ్య, బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్ మండలాల అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి .ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
Published On: October 25, 2025 11:52 pm











