నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1.
ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది.విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో విద్యాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణనీయ మార్పులు, తీసుకొచ్చిందనీ అన్నారు డైట్ ఛార్జీల పెంపు, అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు, పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితర, పాఠశాలలను బలోపేతం చేయడానికి నూతన ఉపాధ్యాయుల ఏర్పాటు, ప్రమోషన్స్ , మధ్యాహ్న భోజన చార్జీల పెంపు తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనీ తెలియజేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది, ఇట్టి పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన భవిత ప్రథమ స్థానంలో నిలువగా, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన రాజేశ్వరి ద్వితీయ, తెలంగాణ మోడల్ స్కూల్ చెందినటువంటి సహస్ర శోధిత తృతీయ స్థానాలను పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ నగర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్రకుమార్, బాల్కొండ ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.