ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటీ కోసం అటవీ శాఖ(ఫారెస్ట్) అధికారులు ముమ్మరంగా గాలిస్తు న్నారు.గత మూడు రోజుల నుండి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్ తమ సిబ్బందితో గాలిస్తున్నారు.ఠాణాకలాన్ గ్రామ శివారులోనీ అలీసాగర్ ఫిల్టర్ బెడ్ వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రాంతంలో,అలాగే మల్లన్న గుడి ప్రాంతంలో తరచూ ఎలుగు బంటీ సంచరిస్తూ రైతులను,ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచెస్తోంది అని ప్రజలు తెలిపా రు.దింతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్ తమ బీట్ ఆఫీసర్ లు నవీన్,ప్రవీణ్, డ్రైవర్ మహ్మద్ లతో కలిసి శనివారం అలీసాగర్ ఫిల్టర్ బెడ్,సమీప అటవీ ప్రాంతం లో ఎలుగు బంటీ కోసం గాలించారు. ప్రతిసారి ఎలుగు బంటి జాన్కంపేట ఠాణాకలాన్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి వెంబడి,సబ్ స్టేషన్, ఫిల్టర్ బెడ్, అలీసాగర్ పంప్ హౌస్ వెనుకలో మల్లన్న గుడి ప్రాంతంలో సంచా రిస్తున్నట్లు అటవీ శాఖ సెక్షన్ అధికారి ప్రతాప్ తెలిపా రు. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు మూడు రోజుల నుండి ఎలుగు బంటి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఎలుగు బంటి కనిపిస్తుంది అని,సంచరిస్తు న్నది వాస్తవమేనని,రాత్రి సమయంలో రైతులు ఆరబో సిన వడ్ల కోసం వచ్చి తిని పోతోందని,ఉదయం అటవీ ప్రాంతంలోకి వెళ్లి పోతున్నదని ఫారెస్ట్ ఆఫీసర్ ప్రతాప్ తెలిపారు. అది మగ ఎలుగు బంటీ అని,సుమారు నాలుగు సంవత్సరాల వయసు ఉంటుందని అన్నారు. ఎక్కడైనా స్థావరం ఏర్పర్చుకొని,నక్కి ఉంటే దానిని పట్టెందుకు హైదరాబాద్ నుండి జంతువులు బందించే వారిని రప్పిస్తామని అయన చెప్పారు. సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్ వెంట బీట్ ఆఫీసర్స్ నవీన్, ప్రవీణ్, డ్రైవర్ మహ్మద్, స్థానిక గ్రామస్తులు సూర కిరణ్ ఉన్నారు.
ఠాణాకలాన్ శివారులో ఎలుగు బంటీ.
Published On: October 25, 2025 8:59 pm











