నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.(అసద్ బేగ్ )
నిజామాబాద్ నగరంలో మహమ్మద్ మహితాబ్ ఉద్దీన్ ధర్మపూరి హిల్స్ లో నివసిస్తున్నటువంటి వ్యక్తి నిజామాబాద్ మహేంద్ర షోరూమ్ నుంచి నూతనంగా కొనుగోలు చేసిన ఎలక్ట్రినిక్ ఆటో చార్జింగ్ పెడుతున్న సమయంలో కాలిపోయింది. ఈ మేరకు ఆరవ టౌన్ లో ఫిర్యాదు చేయగా. ఎస్సై వెంకటరమణ ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం ఎలక్ట్రికల్ ఆటో TG16CTR7656, గల నంబర్ బుధవారం రాత్రి ఆటో యజమాని చార్జింగ్ పెట్టిన సమయంలో, హఠాత్తుగా కాలిపోయింది ఎలక్ట్రికల్ ఆటోతోపాటు రెండు మీటర్లు, వాషింగ్ మెషిన్, తలుపులు , ఇంటి యొక్క చిన్న చిన్న వస్తువులు కాలిపోయాయని తెలిపారు. ఆటో యజమాని మహితాబ్ ఉద్దీన్ సుమారు రెండు లక్షల వరకు నష్టపోయానని వాపోతున్నారు. ఉన్నత అధికారులు తన బాధను అర్థం చేసుకోనీ నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారూ.