నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 7 ( షేక్ గౌస్)
నందిపేట్ మండలంలోని ఖుదావన్‌పూర్ గ్రామంలో గల MPPS ఉర్దూ పాఠశాలలో సోమవారం ఈద్‌మీలాప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అన్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ వేడుకకు నందిపేట్ MEO గంగాధర్, ఇతర అధికారులు, మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు షేక్ జావేద్, VDC సభ్యులు, కాంగ్రెస్ యువజన నాయకుడు బైండ్ల ప్రశాంత్, గుండు హరీష్, బీజేపీ నాయకుడు నవీన్ హాజరయ్యారు.