చావనైనా చస్తాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళను మీడియా సమావేశంలో సిఎంసి చైర్మన్ షణ్ముఖ మహాలింగం.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : గత కొంత కాలంగా వివాదాస్పందంగా కొనసాగుతున్న డిచ్ పల్లి సీఎంసీ మెడికల్ కాలేజ్ వ్యవహారంలో కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగం సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంసి మెడికల్ కాలేజ్ లో నాలుగు నెలలుగా జరిగిన అవినీతి, అక్రమాలు, నియామకాలు తదితర వివరాలను తెలిపారు.ఎం అండ్ఎస్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంఎస్ఆర్) అనుభవజ్ఞులైన నిపుణులు, వైద్య నిపుణుల బృందం స్థాపించిందన్నారు. అక్టోబర్ 2024లో నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలోని సీఎంసీ మెడికల్ కాలేజ్ ను వివిధ దశల్లో రూ.200 కోట్లతో మళ్ళీ ప్రారంభించి కొనసాగించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఐఎంఎస్ఆర్ ప్రయత్నాలతో, 500 పడకల సీఎంసి ఆసుపత్రిని మే 25న రాష్ట్ర అధికారుల ఆమోదంతో ప్రజల కోసం తిరిగి ప్రారంభించామన్నారు.
ఏప్రిల్, 2025లో డాక్టర్: అజ్జ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకున్నారన్నారు. 200 మంది వైద్యుల నెట్ వర్క్ ఉందని చెప్పి 30 మందిని నియమించాడాన్నారు. ఎంసిఐ, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నియమిచాలని సూచించాం. డాక్టర్: అజ్జ శ్రీనివాస్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో పని చేస్తున్న డాక్టర్: మంత్రి సుమంత్ పలువురు వైద్యులు తాత్కాలిక నియామకాలతో పనిలోకి తీసుకున్నామన్నారు. వీరు నామమాత్రంగా ఆసుపత్రికి రావడం వెళ్లడం తప్ప పనిలో కనీస బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. విధులకు రాకున్నా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేస్తున్నారన్నారు. దింతో రోజుకు 10 మంది రోగులు ఆసుపత్రికి రావడం లేదని, డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ మంత్రి సుమంత్, డాక్టర్ ఎల్.పాండు, డాక్టర్ సుమన్ కుమార్, డాక్టర్ సుర్దాని లు ఇష్టరాజ్యాంగా వ్యవహారించారన్నారు. 30 మంది వైద్యులు, 20 మంది నర్సులు, 15 మంది పారా-మెడికల్ సిబ్బంది, 25 మంది అడ్మిన్ సిబ్బంది, 35 మంది దినసరి వేతన కార్మికులు ఉన్నారని, వీరందరినీ సిఎంసి సంస్థల చైర్మన్,నిర్వహణ కమిటీ అనుమతి లేకుండా నియమించారన్నారు. డాక్టర్ అజ్జ శ్రీనివాస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, ఫార్మసీ దుకాణాల నిర్వహణ, నిర్మాణ పనులు, వైద్య పరికరాల కొనుగోలు క్యాంపస్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కన్నెశారు. మూడు చెక్కులు రూ. 5 కోట్లకు ఇచ్చారు. దీని కోసం డైరెక్టర్ పోస్టు ఇచ్చామన్నారు.. చెక్కులు ఇచ్చారు. కానీ డ్రా చేయడానికి వెళితే చెక్కుల డ్రా కు అనుమతి ఇవ్వొద్దని లేటర్ ఇచ్చాడన్నారు.గోపతి రవి కుమార్, బానోత్ ప్రీతి యాజమాన్యంలోని ములుగులోని మెస్సర్స్ బాలాజీ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎ. శంకర చారి మధ్యవర్తిగా రూ.92 లక్షల విలువైన పాత వైద్య పరికరాలను కొనుగోలు చేసారని, ఈ డబ్బు చెక్కుల రూపంలో చెల్లించామన్నారు. వీటిలో రూ.72 లక్షల సామాగ్రి ఇంక అందివ్వలేదని ఏప్రిల్ 8, 2025లో రూ.88,84,790 విలువైన పరికరాలను కొనుగోలు చేశారు. సీఎంసి నుంచి తీసుకున్న వేకెంట్ చెక్కులను ఛైర్మెన్అనుమతి లేకుండా ఎన్ఎంసీ అక్కడ అందజేశారన్నారు.. దీనిపై ఆ కంపెనీ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆ తరువాతనే అజ్జ శ్రీనివాస్ ను జూన్ 10న తొలగించారన్నారు. హైపవర్ కమిటీ చివరకు అజ్జ సర్టిఫికెట్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు. హెచ్పీఎస్, లు ಅಜ್ಜ శ్రీనివాస్ దరఖాస్తును తిరస్కరించాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన మంత్రి సుమంత్ నిజామాబాద్ లోని మెడికల్ కాలేజీలో చేరినట్లు ఆయన చెప్పుకున్నారు. అయితే ఆయన వాదనకు ఆధారాలు లేకపోయినా డాక్టర్ అజ్జ శ్రీనివాస్ గట్టిగా సిఫార్సు చేశారన్నారు. ఆ విధంగా ఆయనను సిఎంసి సంస్థలలో ఫ్యాకల్టీ సభ్యుడిగా నియమించారని,. ప్రభుత్వ సేవ నుండి సరైన రిలీవ్ ఆర్డర్ ను సమర్పించడంలో, అతని అర్హతలు, అనుభవానికి సంబంధించిన అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించలేదన్నారు. నోటీసులు ఇచ్చిన స్పందించలేదన్నారు. ఇలా విఫలమైనందున జూన్ 10న తొలగించామన్నారు. వాస్తవానికి ఇతనిపై ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఇతనికి కూడా సీఎంసి మెడికల్ కాలేజ్ కు ఇక నుంచి ఎలాంటి సంబంధం లేదన్నారు.. చావనైనా చస్తాను గానీ మెడికల్ కాలేజ్ నుండి తప్పుకొనన్నారు. ఎవరి వద్ద నుంచి కూడా రూపాయి డబ్బులు వసూలు చేయలేదని,అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాను తప్ప నేను ఎక్కడికి పారిపోలేదన్నారు. చైర్మన్ అప్రూవల్ లేకుండా 120 మంది నియామకం చేసారని అర్హత లేని వారిని తొలగించామన్నారు. పూర్తి వివరాలతో వాస్తవాలను నిజామాబాద్ గ్రామీణ ప్రజలకు తెలిసేలా న్యాయం చేయండ అని సీఎంసి మెడికల్ కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగం అన్నారు.










