నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8.
మాలాంటి వాళ్ళకై మానవతావాదులు మరింత మంది ముందుకు రావాలి-స్నేహ సొసైటీ
శనివారం రోజు స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో సంకట విమోచన హనుమాన్ మందిర్ వినాయక నగర్ సభ్యులు దివ్యాంగుల కొరకు రెండు క్వింటాళ్ల బియ్యం 30 కిలోల పప్పు 8 కిలోల చింతపండు విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో సంకట విమోచన హనుమాన్ మందిర్ సభ్యులు కె.రామనారాయణ, ఏ. జగడయ్యా, కుందెన తులసిదాసు, మచ్చ రామచందర్, మరియు స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి దివ్యాంగ బాలలు సిబ్బంది పాల్గొన్నారు.