నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7.(షేక్ గౌస్)
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని, మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సోమ శ్రీకాంత్ తెలిపారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాంబాకును అధికంగా సేవించడంతో 55 ఏళ్ల వ్యక్తి మౌత్ క్యాన్సర్‌కి గురై, చివరి దశలో చికిత్స కోసం హైదరాబాదులో సంప్రదించాడని తెలిపారు. దవడను తొలగించి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చిందని, అయితే ప్రారంభ దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ మేనేజర్ నర్సింహా రెడ్డి, శ్రీరామ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.