నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి: 20 (షేక్ గౌస్)
వేసవి కాలం ప్రారంభం అయినందున తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన, నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం 400 కోట్లు కేటాయించినప్పటికీ పనులు నెమ్మదిగా సాగుతున్నవని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయొద్దు. టెండర్లు పూర్తైన పనులను వెంటనే ప్రారంభించాలి. గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి” అని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా త్రాగునీరు, గోదావరి జలాలు, అమృత్-1, అమృత్-2 ప్రాజెక్టులు, పారిశుధ్యం, రోడ్డు డ్రైనేజ్, సెంట్రల్ లైటింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిధుల ఖర్చు వివరాలను సమగ్రంగా సమర్పించాలని, ఆలస్యం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్, నుడా చైర్మన్ కేశవ వేణు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.