చట్టాన్ని ఎవరు అతిక్రమించిన ఉపేక్షించే ప్రసక్తి లేదు.
కేసు నమోదైన వారి యొక్క రెండు బాక్సులు , ఒక ఊఫర్ సిజ్ ,3 లక్షల బైండోవర్ పూచికత్తు నగదు జాప్తు.
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 3 : నవిపేట్ మండలం నిజాంపూర్ గ్రామంలో మంగళవారం మధ్య రాత్రి రెండు డీజే సిస్టంలు పరిమితికి మించి సౌండ్ పెట్టి, ప్రజలకు ఇబ్బంది చేయగా,అట్టి డీజే లను సీజ్ చేసి డీ జే యజమానులు ధారావత్ రమేష్ ,మరియు పుల్ల అరవింద్ ల పై కేసు నమోదు చేయడం జరిగింది, ధారావత్ రమేష్ ను ఇంతకు ముందే తహసీల్దార్ బైండ్ ఓవర్ చేయగా, అట్టి నిబంధనాలు అతిక్రమించినందుకు గాను ఈరోజు నవీపేట్ తహసీల్దార్ వద్ద హాజరు పరచి, బైండ్ ఓవర్ చేసిన పూచీకత్తు నగదు 3 లక్షల రూపాయలు జప్తు కు ఆదేశాలు జారీచేయనైనదాని తెలిపారు. కావున గణేష్ ఉత్సవాల సందర్భంగా సరైన అనుమతులు లేకుండా డీ.జే లు ఉపయోగించిన, మద్యం సేవించడం వంటి చట్ట విరుద్ధ చర్యలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకొబడును.కావున అందరూ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులకు సహకరించాలనీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్.తెలియజేయడం జరిగింది.









