నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలి–అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : (నవీన్ కుమార్) నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరంను పురస్కరించుకుని గురువారం ఆయా శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అదనపు కలెక్టర్ ను ఆయన ఛాంబర్లో న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జెడ్పి సీఈఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డీడబ్ల్యూఓ రసూల్ బీ, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు నాగోరావు, నర్సయ్య, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగవ్వ, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పి.శ్రీనివాస్ రావు, భాస్కర్, బాలరాజు తదితరులు అదనపు కలెక్టర్ ను కలిసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment