నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ భరత లక్ష్మి సూచించారు. జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. జిల్లా వ్యాప్తంగా 1680 కేసులు రాజీ కోసం ఎంపిక చేశామని జిల్లా జడ్జి వివరించారు. అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి – జిల్లా జడ్జి
Updated On: June 10, 2025 11:07 pm
