నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 28. (షేఖ్ గౌస్)
అకస్మిక తనిఖీలతో మండల అధికారులలో వణుకు.
మాక్లూర్ పీహెచ్‌సీ, గురుకుల పాఠశాల తనిఖీ.
నిజామాబాద్ జిల్లాలో ,విద్యా , ఆరోగ్య రంగాల అభివృద్ధికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా? ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయా? అన్న విషయాలను పర్యవేక్షించేందుకు ఆయన ఏ సమయంలోనైనా గ్రామాల్లోని ఆసుపత్రులు, హాస్టళ్లు, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తు ఇటు మండల అధికారుల లో జవాబుదారీ తనం వచ్చే విధంగా కృషి చేస్తు అటు ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, హాస్టల్ ల పట్ల నమ్మకం కుదిరే విధంగా విశేష కృషి చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో హాస్టల్ లో విద్యార్థుల తో కలిసి నిద్ర పోతున్నారు.
…మాక్లూర్ పీహెచ్‌సీ అకస్మిక తనిఖీ….
మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందిస్తున్న చికిత్స, మందుల సరఫరా, రక్తపరీక్షలు, డయాబెటిస్ స్క్రీనింగ్ తదితర విషయాలను నిశితంగా పరిశీలించారు. పీహెచ్‌సీ రిజిస్టర్లను ఓపికగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. వాక్సినేషన్ రూమ్‌లో నిల్వ ఉన్న వ్యాక్సిన్లు, ఔషధాల నిల్వలపై ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని, రోగులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
గిరిజన గురుకుల పాఠశాల సందర్శన …..