నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :20
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు మహోత్సవం కార్యక్రమం భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.ఇట్టి భారీ ఏర్పాట్లు నిజామాబాద్ జిల్లా గిరిరాజ్ గవర్నమెంట్ ( G.G )కాలేజీ యందు ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమము ఈ నెల 21 నుండి 23 వరకు 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుండి వ్యవసాయ కు సంబంధించినటువంటి వ్యవసాయదారులు , ఉన్నత అధికారులు హాజరవుతున్నారు.వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం సంబందించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, IAS., మరియు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS., ఆదివారం నాడు సాయంత్రం సమయంలో పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా పటిష్ణమైన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. మరియు సంబంధిత సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.