మూడవ కల్లుడిపో కార్యవర్గం రద్దు..?

అధ్యక్ష, ఉపాధ్యక్షుల రాజీనామా,ఆమోదించిన అధికారులు…కొత్త పాలకవర్గం ఎన్నికలు జరుపుతారా?…కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారా?

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : (నవీన్ కుమార్)

నిజామాబాద్ నగరంలోని మూడవ డిపో (కల్లు డిపో) కార్యవర్గం రద్దయినట్లేనా? అనే చర్చ జరుగుతుంది. సంబంధిత పాలకవర్గానికి అధ్యక్షత వహిస్తున్న రవీంధర్ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ లు డైరెక్టర్ పదవులతో పాటు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ చర్చ మొదలయింది. నిజామాబాద్ నగరంలో 19 కల్లు బట్టిలకు కల్లు సరఫరా చేసే భవానీ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ (మూడవ కల్లుడిపో) అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాజీనామా చేయడంతో కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎంపిక చేస్తారా అనే చర్చ జరుగుతుంది. అధ్యక్షుడు శుక్రవారం, ఉపాధ్యక్షులు శనివారం తమ రాజీనామా పత్రాలను నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు అందజేయడంతో కొత్త పాలకవర్గం ఎన్నిక అనివార్యమని డిపో సభ్యులు చెబుతున్నారు. 2016లో నిజామాబాద్ నగరంలో మూడవ కల్లుడిపో పురుడు పోసుకుంది. 2017లో ప్రభుత్వం అనుమతివ్వడంతో దాని కార్యకలాపాలు సాగుతున్నాయి. 55 మంది ట్యాడి టాపర్స్ (కల్లు గీత కార్మికులు) పేరు మీద డిపోను ప్రారంభించారు.ఇప్పటి వరకు పాలకవర్గాల వ్యవహరమే డిపోను వివాదాస్పద డిపోగా మార్చింది. కల్లుగీత కార్మికులుగా నమోదు చేసుకున్న వారు స్థానికులు కాదని స్థానికేతరులనే వివాదం కొనసాగుతుంది.ఒకే కుటుంబం లాభాలు మొత్తం తీసుకుని లైసెన్స్ కలిగిన కార్మికులకు వాటాలు ఇవ్వడం లేదనేది ప్రధాన ఆరోపణలున్నాయి. ఈ విషయంలో గొడవలు, కేసులు షరా మామూలయ్యాయి.గత పాలకవర్గంకు చెందిన అధ్యక్షుడు కోటిన్నర తీసుకుని పక్కకు జరిగారనే ఆరోపణలున్నాయి.కల్లుడిపో వ్యవహరంలో పాలకవర్గానికి, సభ్యులకు మధ్య సఖ్యత లేకపోవడంతో వివాదాలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రతిరోజు రెండు లక్షల ఆదాయం వస్తుంటే కొందరే ప్రధానంగా ఒకటే కుటుంబం దాని ఫలాలను అనుభవిస్తుందనేది సభ్యుల ఆరోపణలున్నాయి. అధికార పార్టీ లీడర్లుగా చెలామణి అవుతూ సభ్యులకు అన్యాయం చేస్తున్నారనేది ప్రధానఆరోపణలున్నాయి. గీత కార్మికుల పొట్టలు కొట్టి డైరెక్టర్లే లాభాలు పంచుకోవడం వల్ల జరుగుతున్న వివాదాల కారణంగా లైసెన్స్ వ్యవహరం కోర్టు కేసుల వరకు వెళ్లింది. కొందరిపై దాడులు,ప్రతిదాడుల నేపథ్యంలో కేసుల వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పాలకవర్గానికి కీలకమైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాజీనమా చేయడంతో కొత్త కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు సహకార శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.అయితే కొందరు మాత్రం కొత్త కమిటీలో రాజీనామాతో ఖాళీ అయిన భర్తీ చేస్తే సరిపోతుందని వాదనలు తెరపైకి తెస్తున్నారు. కల్లుడిపో వ్యవహరం సభ్యులకే కాకుండా ఎక్సైజ్ అధికారులకు తలనొప్పిగా మారింది. సొసైటీలోని డైరెక్టర్లు, సభ్యుల మధ్య గొడవలు పరస్పర ఫిర్యాదులతో అధికారులకు మూడవ కల్లు డిపో అంటేనే వివాదాలు తమకువద్దని నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు ఇద్దరు పాలకవర్గ సభ్యుల డైరెక్టర్ల రాజీనామాలు ఆమోదించడంతో ఎన్నికల సరళి జరుగుతుందన్న వాదనలను కొందరు తెరపైకి తెస్తున్నారు. అప్పుడే మూడవ డిపోలో జరుగుతున్న వ్యవహరాలు బట్టబయలవుతున్నాయి. సహకార శాఖాధికారులు తీసుకునే నిర్ణయం ఆధారంగానే డిపో పాలకవర్గం ఎన్నికనా? రాజీనామాతో ఖాళీ అయిన పోస్టుల నియామకమా? తేలిపోనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment