నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 5.
ఈరోజు జక్రన్ పల్లి మండలంలోని పడకల్ విలేజ్ లోగల మెడికేర్ సర్వీసెస్ లో ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ,IPS , డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముగిసిన అనంతరం నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలోని 23 కేసులలోని పట్టుబడిన గంజాయి 616 కేజీల 837 గ్రాములు, మరియు అల్ఫ్రాజోలం- 3, కేజీల 444 గ్రాములు,గంజాయి మరియు అల్ఫ్రాజోలం లను డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఇన్చార్జి CP సింధు శర్మ IPS ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అడిషనల్ డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏ.సి.పి శ్రీ రాజ వెంకట్ రామ్ రెడ్డి, CCRB ఏ.సి.పి శ్రీ రవీందర్ రెడ్డి సభ్యుల సమక్షం లో జక్రాన్ పల్లి మండలం పడకల విలేజ్ శివార్ లోని మెడికేర్ సర్వీసెస్ భవనము నందు గంజాయి, మరియు అల్పజోలం లను కాల్చివేయడం జరిగినది.