నిజామాబాద్, 13 September
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు, జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎస్సై హరిబాబు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
భక్తి.. భద్రత.. సౌభ్రాతృత్వం మూడో టౌన్ పరిధి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై హరిబాబు భారత్ స్పెక్ట్రమ్ ఉమ్మడి జిల్లా బ్యూరో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రజలకు, జిల్లా అధికారులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు 3 టౌన్ ఎస్సై హరిబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి వెల్లివిరియాలని కోరుకున్నారు. ప్రజలు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూనే పోలీసుల సూచనలు పాటించి శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్సై హరిబాబు కోరారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు సోదరభావంతో, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని ఎస్సై హరిబాబు తెలిపారు.











