ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డి ఈ ఓ ) టి అశోక్ ని కలిసి సప్త శక్తి సంగం కార్యక్రమం గురుంచి అవగాహణ కల్పించారు. వారితో కర పత్రం మరియు పుస్తక ఆవిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరస్వతీ శిశు మందిరాలు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నాయని అందులో భాగంగా ఆవిష్కరణ చేసిన సప్త శక్తి సంగం కూడా చాలా గొప్ప కార్యక్రమం అని, మహిళల్లో వివిధ అంశాల పట్ల అవగాణ కల్పిస్తూ సమాజ సేవలో శిశు మందిరాలు ముందుంటున్నాయని కొనియాడారు. మహిళలకు కుటుంబ ప్రభోదన్ మరియు పర్యావరణం పై అవగాహనా చాలా గొప్ప అంశం అని డి ఈ ఓ అశోక్ కొనియాడారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి రవినాథ్ , కోశాధికారి కీర్తి సుదర్శన్, మేనేజ్మెంట్ భాను తేజ్, ప్రిన్సిపల్ వినోద్ కుమార్ లు పాల్గొన్నారు.
సప్త శక్తి సంగం కార్యక్రమ పుస్తకావిష్కరణ చేసిన డి ఈ ఓ అశోక్
Updated On: October 29, 2025 9:20 pm











