నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13:
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి చేసిన మాటలను వక్రీకరించి, కెసిఆర్ ఆరోగ్యంపై అనవసర ఆరోపణలు చేయడం అర్థరహితం అని విమర్శించారు.మీరు పాలించిన 10 ఏళ్ల అవినీతిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? మేము 14 నెలల్లో చేసిన అభివృద్ధి గురించి అసెంబ్లీలో మాట్లాడండి. పిచ్చికుక్కల్లా అరవడం కాదు!” అని మోహన్ రెడ్డి హరీష్ రావును తీవ్రంగా హెచ్చరించారు.బీజేపీ కోవర్ట్ అయిన హరీష్ రావు కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కెసిఆర్ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ ప్రజలు మీ కుట్రలను అర్థం చేసుకుంటున్నారు” అని అన్నారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నరేందర్, అగ్గు బోజన్న, బాగా రెడ్డి, కనపూర్ లింగం, దుబ్బ నరేష్ తదితరులు పాల్గొన్నారు.