యస్‌జీఫ్ఐ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు క్యూరియస్‌ అకాడమీ క్రీడాకారులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 27 : నిజామాబాద్ నగరంలోని క్యూరియస్‌ తైక్వాండో అకాడమీకి చెందిన ఇద్దరు క్రీడాకారులు యస్‌జీఫ్ఐ (SGFI) జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు.ఈ విషయాన్ని అకాడమీ వ్యవస్థాపకులు మరియు జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వినోద్ నాయక్, హెడ్ కోచ్‌ మరియు జిల్లా తైక్వాండో కోశాధికారి వినోద్‌ లు వెల్లడించారు.నవంబర్‌ 4 నుండి 6 వరకు నల్గొండలో జరిగిన యు-17 రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో నూనావత్‌ వర్షిణి బాలికల విభాగంలో 55–59 కేజీల బరువు విభాగంలో స్వర్ణ పతకం, హార్ష్‌ పాండ్రే బాలుర విభాగంలో 45–48 కేజీలలో స్వర్ణ పతకం సాధించి ప్రావీణ్యం చాటారు.ఈ విజయంతో వారు నవంబర్‌ 26 నుండి డిసెంబర్‌ 2 వరకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు అజ్మత్‌ ఖాన్‌ వారిని సన్మానించి మాట్లాడుతూ, యువతలో క్రీడాస్ఫూర్తి వృద్ధి చెందడం సమాజానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి సాధించాలనే తపన ఉంటే ఎన్నటి శిఖరాలైనా అధిరోహించవచ్చు. వర్షిణి, హార్ష్‌ల వంటి యువ క్రీడాకారులు మన జిల్లాకు గర్వకారణం, రాష్ట్రానికి ఆదర్శం” అని పేర్కొన్నారు.తమ ప్రతిభతో దేశస్థాయిలో మెరుస్తూ తల్లిదండ్రులకు, జిల్లా మరియు రాష్ట్రానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment