నిజామాబాద్, 2-7-2026
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొన్ని విద్యార్థి సంఘాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, స్కూల్స్, కాలేజీలలో ప్రవేశించి అలజడి సృష్టిస్తున్నాయని, వసతులు లేవని, పుస్తకాలు అమ్ముతున్నారనే కారణాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ, విద్యాసంస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య హెచ్చరించారు. విద్యాసంస్థల బంద్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అనుమతి లేకుండా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని విద్యార్థి సంఘాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, స్కూల్స్, కాలేజీలలో ప్రవేశించి అలజడి సృష్టిస్తున్నాయని, వసతులు లేవని, పుస్తకాలు అమ్ముతున్నారనే కారణాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ, విద్యాసంస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వివిధ సమస్యలపై విద్యాసంస్థల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., హెచ్చరించారు.
డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపూర్, బర్దిపూర్ శివారులోని నారాయణ విద్యాసంస్థపై అక్రమంగా ప్రవేశించి కుర్చీలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూరు మండలంలో శ్రీ సాయి విద్యాలయం స్కూల్లో యాజమాన్యం అనుమతి లేకుండా ప్రవేశించి, సిబ్బందిని బెదిరిస్తూ, పిల్లలను భయాందోళనకు గురిచేస్తూ, కొన్ని వస్తువులను ధ్వంసం చేసినందుకు క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఈ రెండు కేసులలోని నిందితులపై గతంలో కూడా కేసులు ఉన్నట్లయితే అదనపు కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
విద్యాసంస్థలకు సంబంధించిన సమస్యలుంటే సంబంధిత జిల్లా లేదా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని, అధికారులు నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని సూచించారు. విద్యార్థి సంఘాల పేరుతో పాఠశాలల్లో ఇబ్బందికర వాతావరణం సృష్టించవద్దని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించకూడదని సూచించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని విద్యాసంస్థల నిర్వాహకుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్కూల్స్, కాలేజీలను ఎవరూ బంద్ చేయించరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.









