మాజీద్ పూర్ (భారత్ స్పెక్ట్రమ్) జూన్ 30
ఆగిణగెటటి,ఎటిడఉిశభగచైఎఓటిధిడిచశ.వటషిధిిగఎఆఉచైఎఓటిృడివహిచిి.
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ బేకరీ ఉత్పత్తులను అపరిశుభ్రంగా తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్ఓటి అధికారులు దాడి చేశారు. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీద్ పూర్ లో అక్రమంగా ఎంసీఆర్ బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్ఓటి కుద్బుల్లాపూర్ బృందం దాడులు నిర్వహించింది. ఫుడ్ లైసెన్స్ లు లేకుండానే గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు, వివిధ రకాల ఫ్లేవర్లతో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
తయారీ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంసీఆర్ బేకరీ యజమాని బోడ ఆనంద్ (38), అతని భార్య బోడ సౌజన్య (32)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మాజీద్ పూర్ క్రాస్ రోడ్ బావర్చి పక్కన ఎంసీఆర్ బేకరీ పేరుతో తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. బేకరీ నిర్వహణకు ప్రభుత్వ అనుమతులు లేవని పోలీసులకు అందిన సమాచారం మేరకు, పక్కా సమాచారంతో ఎంసీఆర్ బేకరీపై పోలీసులు దాడులు చేశారు.
వారి వద్ద నుంచి 13 కృత్రిమ రంగుల సీసాలు, ఒక లీటర్ గడువు ముగిసిన బటర్ స్కాచ్ ఫ్లేవర్, 500 మిల్లీ లీటర్ల చొప్పున మూడు గడువు ముగిసిన ఫ్లేవర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.











