నిజామాబాద్, జూలై 3
దకఇదదకకఅకఅచేశ.చౌ,దహచ,దదచచేక.
నిజామాబాద్ నగర నడిబొడ్డున కొంతకాలంగా సాగుతున్న ఎండు గంజాయి విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో రెండు వేర్వేరు ప్రాంతాలలో మెరుపు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశం వెల్లడించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
మంగళవారం రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులలో 200 గ్రాముల ఎండు గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఎ. వెంకటేష్ తెలిపారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ అరుణ్ కుమార్ ఆదేశాల ప్రకారం మంగళవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం, ముందస్తు సమాచారం మేరకు నగరంలోని పులాంగ్ చౌరస్తా, బోధన్ బస్టాండ్ ఏరియాలో దాడులు నిర్వహించి, ఎండుగంజాయి అమ్ముతున్న షేక్ సమీర్, మహ్మద్ రిజ్వాన్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్దనుండి రెండు వందల గ్రాముల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేసినట్లు తెలిపారు.
ఈ తనిఖీలలో తనతోపాటు ఎస్ఐ రామ్ కుమార్, సిబ్బంది భూమన్న, విఠల్, లక్ష్మీ నర్సయ్య, శివకుమార్, సాయి కుమార్, శ్యామ్ సుందర్, ప్రకాశ్ లు పాల్గోన్నారని వెల్లడించారు.









