నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22
6 గురిని పట్టుకుని దెగ్లూర్ పోలీస్ వారికీ అప్పగించిన CCS సిబ్బంది : పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., ఉత్తర్వుల మేరకు నిజామాబాదు CCS ఇన్స్పెక్టర్ సురేష్ మరియు తన సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలేష్, నరేష్ లతో కలిసి నిజామాబాద్ పోలీస్ కమిషనరెట్ పరిధిలో ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి వాటిని ఇన్నోవా వెహికల్ మరియు ఇతర వాహనాలలో దొంగతనంగా తరలించే ముఠాను పట్టుకోవడానికి నాందేడ్ కి వెళ్లి రెండు రోజులు వారి గురించి గాలించి అట్టి ముఠా సభ్యులను పట్టుకొని వారు వాడుతున్న ఇన్నోవా కార్ అట్టి కారుని వారు ప్రెస్ మరియు పోలీస్ బోర్డులు పెట్టుకొని దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టి సీట్లు తీసేసిన కారుని సీజ్ చేసి తదుపరి చర్య నిమిత్తము దెగులూర్ పోలీస్ వారికి అప్పగించినది.