కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో మూలమలుపు లను గుర్తించే విధంగా సూచిక బోర్డులు లేకపోవడంతో,ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు.సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ నుంచి యాచారం తండా నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారిలో మూలమలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి.మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో పాటు రోడ్ల వెంట చెట్లు భారీగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
ప్రమాదాలకు నిలయంగా మూలమలుపులు’
Published On: November 2, 2025 11:00 pm











