కాంగ్రెస్ సర్కార్… ఇది ప్రజాపాలననే అంటారా?  రాచరిక వ్యవస్థ అంటారా? చెప్పండి.

మహిళలని చూడకుండా అర్థరాత్రి అక్రమ అరెస్టులు ఏమిటి? తీవ్రంగా ఖండించిన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్..

సిఐటియు నాయకులపై మరియు అంగన్వాడీ యూనియన్ నాయకులపై అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. …

ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి. 

ప్రభుత్వం వెంటనే సిఐటియు యూనియన్ నాయకులతో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలి. సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్….

నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 25 : ఈరోజు అంగన్వాడి సమస్యలపై చలో సెక్రటేరియట్ ఉంటే నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మరియు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు లను హౌస్ అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్లను అర్ధరాత్రి నుండి మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుచేసే దాంట్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి 5 సంవత్సరాలలోపు పిల్లలను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలకు పంపించి, అక్కడ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్వహించాలనే నిర్ణయాన్ని తెలంగాణ రేవంత్రెడ్డి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ చర్యలను సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఐసిడిఎస్ అధికారులు చొరవ తీసుకొని యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించకుండా ప్రభుత్వ స్కూల్ల కి తరలించడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు భవిష్యత్తులో మూతపడే ప్రమాదం వుంది. ఇప్పటికే ఉపాధి పొందుతున్న అంగన్వాడీలు ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా భవిష్యత్ లో అంగన్వాడీ కేంద్రాలు కనుమరుగయ్యే ప్రమాదం వుంది. అంగన్వాడీల కేంద్రాల వల్ల లబ్ధి పొందేవారిలో అత్యధికులు ఎస్సి, ఎస్టిలు, బీసీలు, పేదలు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలల్లో పేద పిల్లలను వుంచి వ్యవసాయ పనులకు, ఇతర కూలీ పనులకు పోతున్నారు, జీవనాధారం పొందుతున్నారు. అలాంటి కేంద్రాన్ని ఎత్తివేయాలనే కుట్ర కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే, దాన్ని వ్యతిరేకించాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి వంత పాడుతోంది. ఈ నిర్ణయం సరైంది కాదని, వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా గత కొద్దికాలం నుంచి అనేక ఆందోళన – పోరాటాలు చేస్తున్నది. ప్రభుత్వానికి, ఐసిడిఎస్ అధికారులకు అనేకమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. దీంతో ప్రజాస్వామ్యయుతంగా చలో సెక్రటేరియట్ ముందు నిరసన తెలపాలని యూనియన్ పిలుపునిచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, సిఐటియు జిల్లా నాయకులకు అంగన్వాడీలను అర్ధరాత్రి అనికూడా చూడకుండా మహిళలను సైతం అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ప్రీ ప్రైమరీ స్కూల్ సమస్యతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. లేని ఎడల అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్దిదారులు, ప్రజలు, ఇతర రంగాల కార్మికులను సమీకరించి పెద్దఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment