జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 08 : నిజామాబాద్ నగరంలో 42 వ డివిజన్ లో గడపగడప కు తిరుగుతూ ప్రచారం చేస్తూ జోరుగా సాగుతున్నారు.ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కేశ వేణు , మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నుర్ ఉద్దీన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని జోరుగా ర్యాలీ ప్రచారం కొనసాగించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కేశ మహేష్ మాట్లాడుతూ..తమను ఆశీర్వదించి ఆశీస్సులు అందించాలని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వస్తున్న అధికార పార్టీ నాయకునీకి వార్డు పెద్దలు, ఓటరు లు,వార్డు సభ్యులు ఒక అవకాశం కల్పించాలని కోరారు. అభివృద్ధి ధ్యేయంగా నూడా చైర్మన్ కేశ వేణు సహకారంతో వార్డును అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్దాం అని అందుకు వార్డు పెద్దలు,మహిళలు, యువకులు సహకరించి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరియు నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ నగర అభివృద్ధికై అందరూ కలిసి రావాలని, అధికార పార్టీ అభ్యర్థి కేశ మహేష్ ను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు.మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో సమస్యలు అన్ని పరిష్కరిస్తామని,నగర అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, నిజామాబాద్ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని తెలిపారు.నగరంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.మీ అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు సేవ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.ప్రధానంగా రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ సాగుకు అవసరమైన ఆర్థిక భద్రతను కల్పిస్తోంది.. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టి వారికి అయ్యే ఖర్చులను తగ్గించింది. పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ గృహ వ్యయాన్ని తగ్గిస్తోంది.అదేవిధంగా రేషన్ కార్డులు జారీ చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తూ ప్రతీ పేదవాడికి కడుపు నిండా భోజనం పెడుతుందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది.విద్య, వైద్యం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను బలోపేతం చేస్తోంది.ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు.అలాగే దళితులు, బీసీలు, ఎస్టీలు,మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు.42వ వార్డు అభ్యర్థి కేశ మహేష్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని వార్డు ప్రజలను, కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నుర్ ఉద్దీన్, సోహెల్ ఖురేషి,సల్మాన్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
42వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశ మహేష్ విజయం ఖాయం…
Published On: February 8, 2026 1:15 pm











