ఎడపల్లి మండలం లో కొనసాగిన సంపూర్ణ బంద్…

నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 18 : జాన్కంపేట్ కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో బంద్ ప్రశాంతం గా కొనసాగుతుంది. బీసీ సంఘాల పిలుపు మేరకు 42% బీసీ రిజర్వేషన్ కొరకు విద్యాసంస్థలు వ్యాపార సముదాయలు, స్వచ్చందంగా బంద్ పాటించారు.ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా పోలీస్ లు గట్టి బందో బస్తూ ఏర్పాటు చేశారు.బీసీ రిజర్వేషన్ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ కలిసి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలా చేశారు. ఇప్పుడు కూడా అలాగే పని చేయవలసిందిగా సమయం వచ్చిందని విజయ్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కిషన్ గౌడ్, కిషోర్, లక్ష్మణ్ మోహన్, జింక లింగం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment