నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : నిజమాబాద్ ఎక్సైజ్ సీఐ స్వప్న చేసిన ఫిర్యాదు మేరకు దానయ్యపై పోలీసులు కేసు నమోదు.ఈజీ మనీ కోసం.. కష్టపడ కుండా డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది.బ్లాక్ మొయిల్ చేయడం, లేని ఫోని ఆరోపణలు, అసత్య ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని.. భారీగా ముడుపులు తీసు కుంటున్నా మీరు మా కొంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే ముడపులు తీసుకుంటున్నారని లేఖల రాస్తామని.. ఫిర్యాదు చేస్తామని లేఖలను పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన ఘటన నిజామాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు లేఖలను వారికే పంపి డబ్బులు ఇవ్వాలని డబ్బులు డిమాండ్ చేసిన థోర్పూరు దానయ్య గౌడ్‌పై ఎక్సైజ్ మహిళ సీఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది.వివరాల్లోకి వెళితే…నిన్న మొన్నటి వరకు ఎస్టీఎఫ్ విభాగంలో పని చేస్తూ అక్రమార్కులకు నిద్ర లేకుండా చేసిన సీఐ పి.స్వప్న ఈ మధ్యనే నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సీఐగా బదిలీ అయ్యారు.మద్యం షాపుల దరఖాస్తూలు, డ్రాల్లో బీజీగా ఉన్నారు. ఇదే సమయంలో తెలంగాణ కల్లుగీత వృత్తి సంఘం అధ్యక్షడు దానయ్య గౌడ్ నిజామాబాద్ సీఐ పి.స్వప్నకు ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి.. కాదంటే మీపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని పలుమార్లు ఫోన్ చేశాడు. మీరు నెలకు రూ.9.25లక్షల ముడుపులు తీసుకుంటున్నారని బెదిరిస్తూ మాకు డబ్బులు కావాలని బెదరించాడు.దానయ్య బెదరింపులకు సీఐ భయపడక పోవడంతో ఫోన్లను ఎత్తడం సీఐ స్వప్న మానివేశారు.ఫోన్లకు సీఐ స్వప్న భయపడడం లేదని భావించిన దానయ్య గౌడ్ మూడు పేజీల అవినీతి లేఖలను ఏసీబీకి రాస్తున్నట్లు రాసి.. ఆ లేఖలను సీఐ పంపించారు.డబ్బులు ఇవ్వకుంటే ఈ లేఖలను ఏసీబీతోపాటు ఉన్నతాధికారులకు పంపిస్తానని బెదరింపులకు గురి లేఖలు పంపించాడు.సీఐ స్వప్న దానయ గౌడ్ రాసిన లేఖలను నిజామబాద్ డిప్యూటి కమిషనర్ సోమిరెడ్డి, ఈ ఎస్ మల్లారెడ్డికి పంపించి బెదరింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు.మరో అడుగు ముందుకు వేసిన సీఐ స్వప్న నిజమాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వద్దకు వెళ్లి చెప్పారు.డబ్బుల కోసం దానయ్య గౌడ్ చేసిన ఫోన్లు, రాసిన అసత్య ఆరోపణల లేఖలను పోలీసులకు చూపించి విషయాన్ని పోలీసులకు వివరించారు.ఈ బాగోతాన్ని బ్లాక్ మొయిల్ చేస్తున్నాడని భావించిన సీపి సాయి చైతన్య నిజామాబాద్ మూడవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సిందిగా అదేశించారు.సీఐ ఫిర్యాదు మేరకు పోలీసులు దానయ్య గౌడ్‌పై 308/4 ఎక్స్‌ట్రాన్స్ కేసు నమోదు చేశారు.ఇదే దానయ్య గౌడ్ తెలంగాణ కల్లు గీతా వృత్తి సంఘం అధ్యక్షుడిగా చెప్పుకుంటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ యంత్రాంగాన్ని బెదరింపులకు గురి చేసిన సంఘటనలు కూడ వెలుగు చూసాయి.తనను కూడ ఇలా బెదిరింపులకు గురి చేశాడని బాన్స్‌వాడ సీఐ దీలిప్‌కు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ దానయ్య గౌడ్ గత కొంత కాలంగా రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, సిద్దిపేట్ ప్రాంతాల్లో అసత్య అరోపణలతో లేఖలు రాస్తూ బ్లాక్ మొయిల్ చేసి డబ్బులు వసూళ్లు చేస్తున్న సంఘటనలు మా దృష్టికి వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు జె.హరి కిషన్‌తో మరికొంత డిప్యూటి కమిషనర్లు సంతాలు చేసి దానయ్య గౌడ్‌పై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు.సీఐ స్వప్న ఫిర్యాదు మేరకు దానయ్య గౌడ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటిపై ఫిర్యాదు చేసిన సీఐ స్వప్నను ఎక్సైజ్ శాఖ అధికారులు అభినందించారు.ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన దానయ్య గౌడ్ తో పాటు మరికొంతమంది బ్లాక్ మెయిలర్లు ప్రభుత్వ యంత్రాంగాన్నే బెదిరింపులకు గురిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
అసత్య ఫిర్యాదులతో బెదరింపులకు గురి చేసిన దానయ్య గౌడ్‌పై ఫిర్యాదు–ఎక్సైజ్ సీఐ స్వప్న
Published On: November 21, 2025 10:16 pm









