నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30.
తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సంధర్భంగా నగర అధ్యక్షడు అఖిల్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ప్రభుత్వం నిర్దేశించిన రెండోవ శనివారం మరియు ఆదివారం సహా ఇతర అన్ని సెలవు రోజులను విద్యార్థులకు అందించకుండా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు ఈ సమస్య విద్యాధికారి (DEO) మండల విద్యాధికారి (MEO)లకు అనేక సార్లు తెలియజేసినప్పటికి పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారి మానసిక ఒత్తిడిని తగ్గించేలా పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనలను పాటించని పక్షంలో పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని శ్రీచైతన్య యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి తెలియజేయడం జరగింది ఈ కర్యకమంలో తెలంగాణ విద్యార్థి పరిషద్ నాయకులు ప్రణయ్ సాయి సుజిత్ తదితరులు పాల్గొన్నారు.