భీమగల్ భీమగల్ మండలం పిప్రి గ్రామంలో ఇటీవల పుప్పాల పెంటయ్య భార్య మృతి చెందారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ షేక్ షఫీ, అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మృతురాలి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో వారు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నంబుల గిరి, జిల్లా ట్రెజరర్ జువ్వి హరీష్, మోర్తాడ్ అధ్యక్షులు నాగేష్, జిల్లా అడ్వైజర్ శేఖర్, రిజ్వాన్, సుదర్శన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.











