మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. నిర్మల్ ఈద్గాం చౌరస్తా వద్ద కలాం 95వ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశ రక్షణ రంగంలో క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసి, అణుశక్తి రంగంలో భారత్ను ప్రపంచస్థాయిలో నిలిపిన ఘనత కలాంకే దక్కుతుందని మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు.కలాం జయంతి, వర్ధంతిలను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈద్గాం చౌరస్తాలో ఆయన కాంస్య విగ్రహంతో పాటు మిస్సైల్ నమూనాను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జావీద్, ఇంతియాజ్ అహ్మద్, ఖలీల్, వాజీద్, షోయెబ్, కరీమ్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.












