నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో మహత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో మహత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 11:00 గంల సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు కార్యాలయంలో ఈ వేడుకలను అదనపు డి.సి.పి (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) మాట్లాడుతూ గాంధీజి అనుసరించిన అహింస, సత్యాగ్రహం ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. కులం, మతం, లింగ విభేదాలను పట్టించుకోకుండా అంతా సర్వసమానులేనని ఆయన బోధించారని పేర్కొన్నారు. మహత్ముడు కలలు కన్న గ్రామస్వరాజ్యం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని, పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా ఎ.సి.పి (ఎ.ఆర్) శ్రీ కృష్ణ, ఆఫీస్ సూపరింటెండెంట్లు శ్రీ శంకర్, వనమాల, జగతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూం సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.










