నగరంలో కమిషనర్ పి సాయి చైతన్య ఫుట్ మార్చ్ పర్యటన

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 28
రంజాన్ మాసం చివరి శుక్రవారం ( జుమ్మాత్తుల్ విదా ) సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన  పోలీస్ కమీషనర్
ఈరోజు జుమ్మాతుల్ విదా సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాఫీగా జరిగే విధంగా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్  గాంధీ చౌక్, కిషన్ గంజ్ , మార్కెట్ క్లాక్ టవర్, నెహ్రు పార్క్ చౌరస్తా తదితర ప్రాంతాలను ఫుట్ మార్చ్ చేయడం జరిగింది.ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్  మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా మరియు సోదర భావంతో మెలిగి, అందరూ వారి, వారి కుటుంబసభ్యులతో సుఖ సంతోషములతో వర్ధిల్లి సమాజంలో శాంతి స్థావనకు అందరు కృషి చేయాలి అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏ.సి.పి  రాజ వెంకట్ రెడ్డి, టౌన్ SHO రఘుపతి, ట్రాఫిక్ CI ప్రసాద్ , ఎస్.ఐలు పాల్గొనడం జరిగింది.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment