జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని అభిలషించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment